Fri Dec 05 2025 14:40:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ గాయని సుశీల ఆసుపత్రిలో చేరిక
ప్రముఖ సినీ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు

ప్రముఖ సినీ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పి.సుశీల వయోభారంతో వృద్ధాప్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్నారు. శనివారం ఆమెకు కడుపు నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే సాధారణంగా వచ్చే కడుపునొప్పేనని, భయపడాల్సిన పనిలేదని చెన్నైలోని కావేరి ఆసుపత్రి శాఖ వైద్యులు తెలిపారు.
ఆరోగ్యం నిలకడగా...
సుశీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. పి. సిశీల దాదాపు తొమ్మిది భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. టాలీవుడ్ పరిశ్రమను ఒకప్పుడు సుశీల గొంతు లేకుండా పాట ఉండేది కాదు. ఆమెకు పద్మభూషణ్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Next Story

